NTV Telugu Site icon

Odisha Train Accident: మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్..

Chiru Emotional

Chiru Emotional

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందగా, 900 మంది గాయాలపాలయ్యారు.. ఎంతో మంది ప్రాణాలతో పోరాడుతున్నారు.. చాలా మంది బోగీల్లో ఇంకా చాలా మంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు సహాయ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి..

 

ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా భువనేశ్వర్, ఖరగ్ పూర్, కోల్ కతాలోని ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన తరలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన చోట హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎటు చూసిన మృతదేహాలు కుప్పలుగా పడిఉన్నాయి.. ఆ ప్రాంతమంతా మృతుల బంధువుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి..

 

ఇక ఈ ప్రమాదంపై పలువురు టాలీవుడ్‌ స్టార్స్‌ స్పందిస్తూ తగిన సాయం అందిస్తామని హామీ ఇస్తున్నారు.. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడ్డవారి ప్రాణాలను రక్షించేందుకు రక్త యూనిట్లను దానం చేయాలని అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.. ప్రాణాలను కాపాడేందుకు రక్త యూనిట్ల కోసం తక్షణ డిమాండ్ ఉందని నేను అర్థం చేసుకున్నాను. సాధ్యమైనంత మేరలో వెంటనే రక్త యూనిట్లు అందించాలని నా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్ట సమయంలో తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్‌ లో పేర్కొన్నారు..అదే విధంగా..జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు..ఈ ప్రమాదంపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉంటూ బాధితులకు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.. తనవంతు సాయాన్ని ప్రకటించారు.. ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..