నల్సార్ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులైన లా స్టూడెంట్స్ కు డిగ్రీ పట్టాలు అందజేశారు. పీహెచ్ డీ చేసిన వారికి గోల్డ్ మెడల్స్ బహుకరించారు.
స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ…. డిగ్రీ పట్టాలు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యులకు న్యాయం చేసే విధంగా న్యాయవాదులు తమ వృత్తి నిర్వహించాలని సూచించారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్కత్ పురాలో ఓ చిన్న గదిలో ప్రారంభమైన లా యూనివర్సిటీ….. ఇవాళ ఎంతో మంది న్యాయవాదులను తయారు చేసే స్థాయికి వచ్చిందన్నారు. నల్సార్ యూనివర్సిటీ నిర్వాహకులను, అధ్యాపకులను అభినందించారు… డిగ్రీ పట్టాలు పొందిన వారితో సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రూప్ ఫోటో దిగారు…
