మేషం: ఈ రోజు ఈ రాశివారు విందు, వినోదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.
వృషభం: ఈ రోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచి జరుగుతుంది.. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి.
మిథునం: ఈ రోజు ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మానసిక చంచలంతో ఇబ్బంది పడటారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు.
కర్కాటకం: ఈ రోజు ఈ రాశివారు రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు.. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి.
సింహం: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల విషయంలో అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు.
కన్య: ఈ రోజు ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉండే అవకాశం ఉంది.. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.
తుల: ఈ రోజు ఈ రాశివారి మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.. ఆరోగ్యం గురించి జాగ్రత్తవహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా ఫలప్రదం అవుతాయి.
వృశ్చికం: ఈ రోజు ఈ రాశివారి విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం ఎంతో మేలు చేస్తుంది.
ధనుస్సు: ఈ రోజు ఈ రాశివారి కుటుంబ కలహాలు, ఇతర విషయాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. అదే మీకు ఎంతో మేలు చేస్తుంది.
మకరం: ఈ రోజు ఈ రాశివారు ఒకటి కోరుకుంటే మరొకటి జరుగుతుంది.. అనారోగ్య బాధలు స్వల్పంగా ఇబ్బంది పెడతాయి.. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల మరింత శ్రద్ద వహించడం మంచిది.
కుంభం: ఈ రోజు ఈ రాశివారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురువుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం లేకపోలేదు.. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
మీనం: ఈ రోజు ఈ రాశివారి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా సాగుతాయి.. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాల కోసం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
