యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగెటివ్ రావడం ఆనందంగా ఉంది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కిమ్స్ హాస్పిటల్స్ నుండి నా వైద్యులు డిఆర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది. నా ఆరోగ్యం గురించి మంచి కేర్ తీసుకున్నారు” అంటూ తనకు కరోనా తగ్గిపోయిందన్న విషయాన్ని వెల్లడించారు. మరో ట్వీట్ లో “కోవిడ్-19ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పాజిటివ్ గా ఉంటే ఈ వ్యాధిని అధిగమించవచ్చు. ఈ యుద్ధంలో మీ విల్ పవరే మీకు అతి పెద్ద వెపన్. స్ట్రాంగ్ గా ఉండండి. భయపడకండి. మాస్క్ ధరించండి… ఇంట్లోనే ఉండండి” అంటూ అందరికీ ధైర్యం చెప్పారు ఎన్టీఆర్. మే 10న ఎన్టీఆర్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు.
కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్
