Site icon NTV Telugu

తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌కుంటే… వారికే లాభ‌మా…!!

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు కావొస్తున్నా  ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ‌దేశాలు గుర్తించ‌లేదు.  ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌క‌పోవ‌డంతో పాటుగా విదేశీ మార‌క ద్ర‌వ్య‌నిల్వ‌ల‌ను అమెరికా ఫ్రీజ్ చేయ‌డంతో ఆఫ్ఘ‌నిస్తాన్ దిగుమ‌తులు చేసుకోలేక‌పోతున్న‌ది.  దీంతో దేశంలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అంత‌కంత‌కు పెరుగుతూనే ఉన్నాయి.  తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌క‌పోవ‌డంతో దేశంలో ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ య‌దేచ్చ‌గా రెచ్చిపోతున్న‌ది.  కాంద‌హార్‌, కుందుజ్ ల‌లోని మ‌సీదుల్లో ఐసిస్ ఉగ్ర‌వాదులు బాంబుపేలుళ్ల‌కు పాల్ప‌డుతున్నాయి.  ఈ ఘ‌ట‌న‌ల‌లో వంద‌లాది మంది మృతి చెందారు.  అనేక మంది గాయ‌ప‌డ్డారు.  తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇప్ప‌టికైనా ప్ర‌పంచ దేశాలు గుర్తించాల‌ని, లేదంటే దేశంలో ఐసిస్ కె ఉగ్ర‌వాదుల ప్రాబ‌ల్యం పెరిగిపోతుంద‌ని, ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వ‌స్తుంద‌ని తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.  

Read: నేడు దేశ‌వ్యాప్తంగా రైల్‌రోకో…

Exit mobile version