ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారం రేపాయి. దీంతో రాధా అంశంపై స్పందించిన బెజవాడ సీపీ క్రాంతి రానా మాట్లాడుతూ.. రాధా రెక్కీపై నిర్దిష్ట ఆధారాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని, మాకు రాధా రెక్కీపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఆయన అన్నారు.
అంతేకాకుండా 2 నెలల సీసీ టీవీ ఫుటేజ్ ను ప్రస్తుతం పరిశీలిస్తామని, ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.