ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని.. యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ విస్తరిస్తున్న సమయంలో యూపీలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. డిసెంబర్ 25 వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యూపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది యోగి సర్కార్.
అలాగే..వివాహాలకు 200 మందికి మించి అనుమతి లేదని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రజలు గుమికూడకుండా పలు ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించింది. ఇది ఇలా ఉండగా.. ముంబై లో అర్థరాత్రి నుంచి 144 సెక్షన్ విధిస్తున్నారు. గుజరాత్ లోని 9 నగరాల్లోనూ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి.
