Site icon NTV Telugu

ఇక‌పై అక్క‌డ నో స్మోకింగ్‌… యువ‌త‌ను ర‌క్షించేందుకే…

ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అంటారు.  ధూమ‌పానం చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.  ఊపిరితిత్తుల‌తో పాటు లివ‌ర్ కూడా పాడైపోతుంది.  ఫ్యాష‌న్ మోజులో ప‌డి యువ‌త సిగ‌రేట్ కాలుస్తూ ఆరోగ్యాన్ని, విలువైన ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు.  దీంతో న్యూజిలాండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  2008 వ సంవ‌త్స‌రం త‌రువాత పుట్టిన వారు స్మోకింగ్ చేయ‌కుండా చ‌ట్టాన్ని చేసింది.  

Read: బాలినో భ‌ళా… మూడేళ్ల కాలంలో…

ఇప్పుడు సిగ‌రేట్‌లో ఉన్న నికోటిన్ శాతాన్ని కూడా క్ర‌మంగా త‌గ్గించే చ‌ర్య‌లు కూడా చెప‌డుతున్న‌ట్టు న్యూజిలాండ్ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  దేశంలోని యువ‌త‌కు సిగ‌రేట్లు అంద‌కుండా చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, ప్ర‌తి ఏడాది ధూమ‌పానం 4500 మంది నుంచి 5000 మంది వ‌ర‌కు చ‌నిపోతున్నార‌ని న్యూజిలాండ్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.  న్యూజిలాండ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌పంచ‌దేశాలు స్వాగ‌తించాయి. 

Exit mobile version