Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మరో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు

Tamil Nadu

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉన్నాయి.. భారత్‌లోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల బాట పడుతున్నాయి.. ఇక, తమిళనాడులో ఇప్పటికే 120కి పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఆ రాష్ట్రం కూడా కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది..

Read Also: ఒమిక్రాన్‌ వెలుగుచూసిన చోట ఆంక్షలు ఎత్తివేత..

ఇవాళ్టి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని సీఎం స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నేటి నుంచి రాష్ట్రంలో యాభై శాతం ఆక్యుపెన్సీతో…. కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. ఇక, 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్, సినిమా థియేటర్లు, బస్సులు, మెట్రో రైళ్లు ఉండేలా చూడాలని ఆదేశించింది సర్కార్.. మరోవైపు, అన్నిచోట్ల శానిటైజర్, ఉష్ణోగ్రత పరీక్షలు నిర్వహించిన తర్వాతనే లోపలికి అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు.. మాస్క్‌ కూడా తప్పనిసరి చేశారు.

Exit mobile version