Site icon NTV Telugu

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌… పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సిఎం తెలిపారు.

read also : ఏపీ రిటైల్‌ పార్క్స్‌ పాలసీ విడుదల

జూలై 26 నుంచి 31 తారీఖు వరకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సిఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

Exit mobile version