NTV Telugu Site icon

ఆజానుభాహులు కాస్తా పొట్టిగా మారుతున్నారే?

అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా అందంగా కన్పించాలంటే మేనిఛాయతోపాటుగా మంచి హైట్ కూడా ఉండాల్సిందే. మేనిచాయ కోసం మేకప్ వేసుకుంటే సరిపోతుంది కానీ హైట్ అలా కాదుగా.. హహ.. అది తల్లిదండ్రుల జీన్స్ తో వచ్చేదని అందరికీ తెల్సిన విషయమే. తాజాగా ఓ సర్వేలో హైట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక హైట్ ఉండే ఆదేశవాసులు క్రమంగా తమ ఎత్తును కోల్పోతున్నట్లు వెల్లడింది. ఇందుకు గల కారణాలెంటో కూడా ఆ సర్వే వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

ప్రపంచంలోనే ఆరడుగుల ఆజానుభాహులు ఉన్న దేశంగా నెదర్లాండ్ కు గుర్తింపు ఉంది. ఆ దేశంలోని మగవారితోపాటు మహిళలు కూడా ఆరడుగులుపైనే ఉంటారు. ఈ కారణంగానే ప్రపంచంలో అత్యంత ఎతైన జనాభా కలిగిన దేశంగా నెదర్లాండ్ రికార్డు నెలకొల్పింది. గత ఆరు దశాబ్దాలుగా ఈ రికార్డు ఆ దేశంపైనే ఉంది. అయితే తాజాగా ఆ దేశంలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఆదేశం క్రమంగా ఈ రికార్డును కోల్పోయే అవకాశం ఉందని వెల్లడైంది. మునుపటి తరంతో పోలిస్తే నేటి తరం వాళ్లు ఒక సెంటిమీటర్ హైట్ తగ్గిపోయినట్లు ఆ సర్వే బృందం ప్రకటించింది.

ప్రస్తుతం ఆ దేశంలో 19ఏళ్ల యువతి సగటు హైట్ ఆరు అడుగులు(182.9సెం.మీ), యువకుడి సగటు హైట్ ఐదడుగుల ఏడు అంగుళాలు(169.3సెం.మీ)గా ఉంది. ఇప్పటికే ఆ దేశం పేరిట అత్యంత ఎత్తు కలిగిన జనాభా రికార్డు ఉంది. అయితే 1980 తరం జనాభాతో పోలిస్తే ఇప్పటి తరం జనాభా హైట్ క్రమంగా తగ్గిపోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. 1980 జనాభా హైట్ తో పోలిస్తే 2001లో పుట్టిన వారి సరాసరి సగటు హైట్ కనీసం ఒక సెంటిమీటర్ తగ్గిందట. అదే మహిళల్లో 1.4సెం.మీ హైట్ తగ్గిపోయినట్లు తేలింది.

ఆ దేశంలోని 19 ఏళ్ల నుంచి 60ఏళ్ల వయస్సు కలిగిన 7లక్షల19వేల మంది ఎత్తుపై ఆదేశానికి చెందిన ప్రభుత్వ సంస్థ సీబీఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాల ఆధారంగా నెదార్లాండ్ వాసులు క్రమంగా హైట్ తగ్గిపోతున్నారని తేలింది. ఇందుకు గల కారణాలను ఆ సంస్థ వెల్లడించింది. పౌష్టికాహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మునుపటి తరంతో పోలిస్తే ఈతరం వాళ్లు ఎత్తు తగ్గిపోతున్నారని పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే మరింత ఎత్తు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మరోవైపు నెదార్లాండ్ వాసులపై 2007సంవత్సరం ఆర్థిక సంక్షోభం పడిందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఆ సమయంలో దేశంలో ఆర్థిక వల్ల అప్పటి చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందకపోవచ్చని కొందరు అంటున్నారు. ఇది కూడా హైట్ తగ్గడానికి కారణమని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం 2007 ఆర్థిక సంక్షోభం వల్ల హైట్ తగ్గిపోవడం అనేది ఊహజనితంగా కొట్టిపారేస్తున్నారు. ఏదిఏమైనా చిన్నారులు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే మంచి ఎత్తు ఎదుగుతారని తాజా సర్వే ద్వారా మరోసారి వెల్లడైంది.