Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. అక్కడ ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్‌..

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ఇప్పటికే చాలా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. కేసుల తీవ్రత పెరుగుతుండడంతో.. మళ్లీ మాస్క్‌ తప్పనిసరి చేస్తున్నాయి.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు ఉపక్రమించాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. క్రిస్మస్‌ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండటంతో.. లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఒమిక్రాన్‌ కట్టడిలో భాగంగా నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ ఇవాళ్టి నుంచి జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ఆ దేశా ప్రధాని మార్క్‌ రూట్‌ వెల్లడించారు. అయితే, ఈ సమయంలో.. నిత్యావసరాలు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనుండగా.. ఇతర దుకాణాలు, బార్‌లు, జిమ్‌లు, క్షౌరశాలలు, ఇతర బహిరంగ కార్యక్రమాలు అన్ని బంద్‌ కానున్నాయి.

Exit mobile version