ఈ మధ్యకాలంలో పెళ్లైన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కాపురం అన్నతరువాత కలహాలు కామనే. అంతమాత్రం చేత విడిపోతే ఎలా అని పెద్దలు సర్థిచెప్పినా పెద్దలాభం ఉండటం లేదు. కొత్తగా పెళ్లైన వారు కొన్ని రకాల సూత్రాలను పాటిస్తే వారి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సూత్రాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
Read: అక్కడ కార్తీక మాసంలోనే మొదలైన కోడి పందేలు.. 32 మంది అరెస్ట్…
- కొంతమంది చిన్న చిన్న విషయాలకు మూతి ముడుచుకొని కూర్చుంటారు. చిన్న చిన్న గ్యాప్ వలన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు సర్ధుకుపోయి గ్యాప్‌ను క్లోజ్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా సాగుతుంది.
- ఆర్థికాంశాలు: ఈ ఆధునిక కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఇద్ధరికీ ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. కానీ, ఆర్థిక అంశాలపై పూర్తిగా ఒకరి అజమాషి జరగాలని పట్టుబట్టకూడదు. అలా పట్టుబట్టితే లైఫ్ ఇబ్బందుల్లో పడిపోతుంది.
- భావ వ్యక్తీకరణ: చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. అలా కాకుండా కొంత చెప్పి కొంత దాచుకోకూడదు.
Read: ఆ కారిడార్‌పై చైనా కన్ను… అదే జరిగితే…
- శృంగారం: భార్యాభర్తల బంధంలో కీలక పాత్రను పోషించేది ఇదే. ఇద్దరి మధ్య శృంగారం మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా సాగితే వారి దాంపత్యజీవితం ఆనందంగా మారుతుంది. అలా కాకుండా మొక్కుబడిగా సాగితే జీవితం నిస్సారంగా మారుతుంది.
- నమ్మకం: భార్యభర్తలు కలిసిమెలిసి మాట్లాకునేందుకు తగిన సమయం, వాతావరణం సమకూర్చుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని చర్చించుకుంటే దాంపత్యం సజావుగా సాగుతుంది. నమ్మకం బలంగా ఉంటే వారి లైఫ్ కూడా అంతే సంతోషంగా మారుతుంది.
- స్మార్ట్‌ఫోన్: స్మార్ట్‌ఫోన్ లు జీవితాల్లోకి ప్రవేశించిన తరువాత దగ్గరగా ఉన్నా, సాంకేతికంగా వారి మధ్య దూరం భారీగా పెరిగింది. దాంపత్యజీవితంలో స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువగా వినియోగిస్తే అంత ఎక్కువగా వారి జీవితం బలంగా మారుతుంది.