NTV Telugu Site icon

హార్డిక్ పాండ్యాను వదులుకోనున్న ముంబై ఇండియన్స్?

ఐపీఎల్‌లో ముంబై జట్టుకు కీలక ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా ఒకడు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో హార్డిక్ పాండ్యా పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. పైగా పలు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడు బౌలింగ్ కూడా వేయలేదు. దీంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయావకాశాలు దెబ్బతిన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముంబై జట్టులో హార్డిక్ పాండ్యా చోటుకు అవకాశాలు సన్నగిల్లాయి.

Read Also: గుడ్ న్యూస్ చెప్పిన క్రికెటర్ దినేష్ కార్తీక్

రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కేలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, డెత్ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా, విండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను మాత్రమే రీటైన్ చేసుకునేందుకు జట్టు యాజమాన్యం ఆసక్తి చూపిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో త్వరలో జరగనున్న వేలంపాటలో హార్డిక్ పాండ్యా అందుబాటులో ఉండే అవకాశముంది. ఒకవేళ పాండ్యా టీ20 ప్రపంచకప్‌లో రాణిస్తే వేలంలో అతడికి మంచి ధర వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా పాండ్యాను ఏ టీమ్ వేలంలో కొనుగోలు చేస్తుందో ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది.