Site icon NTV Telugu

పులి చర్మం అమ్మేందుకు ప్రయత్నం.. ముఠా అరెస్ట్

పులి చర్మం అమ్మేదుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు ములుగు జిల్లా పోలీసులు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఛత్తీస్‌ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేస్తుంటే రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని గుర్తించి తనిఖీలు చేస్తే పులి చర్మం బయటపడింది.

ఇది నిజమైందో కాదో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అది నిజమైన పులి చర్మం అని అటవీ అధికారులు నిర్ధారించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి నుండి పులి చర్మం, 3 సెల్ ఫోన్లు, రెండు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు ములుగు పోలీసులు. పూనం విగ్నిహ తండ్రి సత్య నారాయణ 23 సం. కోయ, డ్రైవర్, కొండాపురం, చీరా క్లీసు తండ్రి వెంకన్న, 32 ఏళ్ళు, తాపీ మేస్త్రీ తో పాటు కె. సోయం రమేష్ తండ్రి పాండు, 37 ఏళ్ళు, చింతల బాలకృష్ణ తండ్రి కోటయ్య, 25 ఏళ్ళు, ఆటో డ్రైవర్. సోది వంటి తండ్రి బాబు, 23ఏళ్ళు కూలీని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితుల్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఏడాది మూడు పులిచర్మాలను పట్టుకున్నారు ములుగు పోలీసులు. ఈ ఏడాది జూలై 3, అక్టోబర్ 3, డిసెంబర్ 21న పులిచర్మాలు పట్టుబడ్డాయి.

Exit mobile version