NTV Telugu Site icon

బ్రిట‌న్‌లో అంబానీ కొత్త ఇల్లు… ఎంత‌కు కొనుగోలు చేశారో తెలుసా…

ప్ర‌తీ ఏడాదీ దివాళీ వేడుక‌ల‌ను ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు.  ముఖేష్ అంబానీ ఇంటికి వీవీఐపీలు, సెల‌బ్రిటీలు దివాళీ వేడుక‌ల స‌మ‌యంలో త‌ర‌లివ‌స్తుంటారు.  వారితో క‌లిసి వేడుక‌లు నిర్వ‌హిస్తుంటారు.  క‌రోనా కార‌ణంగా గ‌తేడాది ముంబైలోని అంటిలియాలోనే ఉండిపోయారు.  అంటిలియాలోని జామ్‌న‌గ‌ర్‌తో పాటు, అటు గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్ రిఫైన‌రీ ప్రాంతంలోని ఇంట్లో అంబానీ ఉన్నారు.  

Read: ఇండియా అబ్బాయి…పాక్ అమ్మాయి… మూడేళ్లుగా నిరీక్షించి… చివ‌ర‌కు…

ఇండియాతో పాటుగా విదేశాల్లో కూడా ఇల్లు ఉండాల‌ని భావించిన ముఖేష్ అంబాని కుటుంబం బ్రిట‌న్‌లోని బ‌కింగ్‌హామ్‌షైర్‌లోని కౌంటీ క్ల‌బ్‌లోని స్టోక్ పార్క్‌ను అంబానీ కుటుంబం కొనుగోలు చేసింది.  దాదాపు 300 ఎక‌రాల్లో ఈ ప్యాలెస్ విస్త‌రించి ఉన్న‌ది.  ఈ ప్యాలెస్‌ను అంబానీ కుటుంబం రూ.592 కోట్ల రూపాయ‌ల‌తో కొనుగోలు చేసిన‌ట్టుగా అంత‌ర్జాతీయ పత్రిక‌ల్లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.  ఈ ఇంట్లోనే దేవాల‌యాన్ని కూడా నిర్మించబోతున్నార‌ని, దీనికోసం ముంబైనుంచి పురోహితుల‌ను బ్రిట‌న్ తీసుకెళ్లార‌ని క‌థ‌నం.  దీపావ‌ళి వేడుక‌ల‌ను అంబానీ కుటుంబం కొత్త ఇంట్లో జ‌రుపుకుంటున్నార‌ని అంత‌ర్జాతీయ ప‌త్రిక క‌థ‌నాల్లో పేర్కొన్న‌ది.