కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వేగంగా కేసులు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పని సరి అని చెబుతున్నా, ప్రజలు ఆ మాటలు నెత్తికెక్కించుకోవడం లేదు. నాయకులే మాస్కులు పక్కన పెట్టి సభలు, సమావేశాలు, యాత్రలు చేస్తున్నారు. రాజు చూపిన బాటలోనే కదా ప్రజలు నడిచేది. అందుకే ప్రజలు కూడా అలానే చేస్తున్నారు. అయితే, మనుషుల కంటే తానే బెటర్ అని చెప్పకనే చెప్పింది ఓ కోతి. దారిలో దానికి ఓ నల్లటి మాస్క్ కనిపించింది. వెంటనే దానిని తీసుకొని శుభ్రంగా దులిపి ముఖానికి తగిలించుకుంది. కాసేపు మాస్క్ పెట్టుకొని అటుఇటు తిరిగింది. చూసేందుకు ఇది ఫన్నీగానే అనిపించవచ్చు. కానీ, దాని వెనుక చాలా మెసేజ్ ఉన్నది. కరోనా సమయంలో మాస్క్ పెట్టుకోవాలని అలా చేయకుంటే కరోనా బారిన పడాల్సి వస్తుందని కోతి చెప్పకనే చెప్పింది.
మాస్క్ ధరించిన కోతి… ఫన్నీగా ఉన్నా…మెసేజ్ అద్భుతం…
