దీపావళి సందర్భంగా ఉత్తరాధికి చెందిన వ్యక్తులు లక్ష్మీ పూజను నిర్వహిస్తుంటారు. దీపావళికి ముందురోజు ఈ పూజను నిర్వహిస్తారు. పూజగదిలో డబ్బును ఉంచి పూజిస్తారు. ఇలానే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివశించే ప్రకాశ్ చంద్ జైన్ అనే వ్యక్తి తన ఇంట్లో లక్ష్మీపూజను నిర్వహించారు. పూజ నిర్వహించేసమయంలో గదిలో మూడున్నర లక్షల డబ్బును ఉంచారు. ఇంటికి వచ్చిన అతిధుల కోసం క్యాటరింగ్ ఆర్డర్ చేశాడు. అతిథులు భోజనాలు చేసిన తరువాత వారిని పంపించేందుకు యజమాని జైన్ బయటకు రాగానే, కేటరింగ్ సప్లై చేసేందుకు వచ్చిన షేక్ చాంద్ రజాక్ ఆ డబ్బును కాసేశాడు.
Read: తాలిబన్లు మరో సంచలన నిర్ణయం: అమెరికాను దెబ్బకొట్టేందుకు…
పూజ గదిలో డబ్బు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని అందరిని చెక్ చేయడం మొదలుపెట్టాడు. జేబులో ఉన్న డబ్బు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి కొంత మొత్తాన్ని బాత్‌రూమ్‌లోని టాయిలెట్ కమోడ్‌లో వేసి ఫ్లష్ చేశాడు. జేబులో రూ. 75 వేలు ఉంచుకున్నాడు. చాంద్ రజాక్ జేబులోని 75 వేలు చూసి షాకైన యజమాని మిగతా డబ్బు గురించి ప్రశ్నించగా కమోడ్‌లో వేసినట్టు తెలిపాడు. ప్రకాశ్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రజాక్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.