NTV Telugu Site icon

సీఎం జగన్‌కు వైసీపీ ఎమ్మెల్యే రోజా సర్‌ప్రైజ్ గిఫ్ట్

Roja

Roja

ఈనెల 21న (మంగళవారం) ఏపీ సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం వినూత్నంగా ఆలోచించారు. బోకేలు, శాలువాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయని.. అదే ఒకరికి సాయం చేస్తే చిరకాలం గుర్తుంటుందని రోజా భావిస్తున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న రోజా.. ఈ ఏడాది నగరి నియోజకర్గంలోని ముస్లిం గ్రామం మీరాసాబ్ పాలెంను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.

మీరాసాబ్ పాలెం గ్రామంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. అందుకే ఈ ఊరిని దత్తత తీసుకుని జగన్ వచ్చే బర్త్ డే లోపు మోడల్ విలేజ్‌గా మార్చి బహుమతిగా ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా కరోనాతో చనిపోయిన మ‌ృతుల కుటుంబాలకు దుస్తులు, సరుకులు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా బాధిత కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. కాగా గత ఏడాది దత్తత తీసుకుని రోజా చదివిస్తున్న చిన్నారి పుష్ప ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో 89 శాతం మార్కులతో సత్తా చాటిన విషయం తెలిసిందే.