NTV Telugu Site icon

వైరల్… 2001లో కేటీఆర్ ఎలా ఉన్నారో చూశారా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన విధులతో ఎప్పుడూ బిజీగా కనిపిస్తుంటారు. ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. ఒక్కోసారి మీట్ విత్ కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో నెటిజన్‌లతో చిట్‌చాట్ కూడా నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా మంత్రి కేటీఆర్ నెటిజన్‌లతో పంచుకుంటారు.

Read Also: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 100 మంది మృతి

తాజాగా మంత్రి కేటీఆర్ తాను 2001లో లండన్‌లో ఉన్నప్పటి సమయంలో తన మిత్రులతో దిగిన రెండు ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలకు లండన్ వీధుల్లో హాయిగా షికారు అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. ఈ ఫోటోలలో మంత్రి కేటీఆర్ కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఫోటోలు అదిరిపోయాయని ఒకరు.. హీరోలా ఉన్నారని మరొకరు… వండర్‌ఫుల్ మెమొరీస్, డ్రెస్సింగ్​స్టైల్ ​సూపర్​ అంటూ వేరొకరు కామెంట్ల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.