Site icon NTV Telugu

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి.. ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని తన ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరారు.

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ ద్వారా గుర్తుచేశారు. ఈనెల 6న జరిగే సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని ప్రధాని మోదీని కేటీఆర్ కోరారు. ఈ మేరకు పలు ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా కల్పించిన అంశంపై కొన్ని పేపర్ క్లిప్పింగులను కూడా మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పోస్టు చేశారు.

Exit mobile version