Site icon NTV Telugu

ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న తాజా స‌ర్వే… చైనా వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో మొద‌లైన భ‌యాలు…

ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్న‌ది.  వేగంగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో వ్యాక్సినేష‌న్ ను వేగ‌వంతం చేశారు.  క‌రోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నో ర‌కాల వ్యాక్సిన్ల అందుబాటులోకి వ‌చ్చాయి.  ఈ వ్యాక్సిన్ల ప‌నితీరుపై ఇప్పుడు సర్వ‌త్రా ఉత్కంఠ‌త మొద‌లైంది. దీనికి కార‌ణం హాంకాంగ్ శాస్త్ర‌వేత్త‌లు అందించిన స‌ర్వే అని చెప్ప‌వ‌చ్చు.  చైనాకు చెందిన సీనోఫామ్ సంస్థ త‌యారు చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను ప్ర‌పంచంలోని చాలా దేశాల‌కు ఎగుమ‌తి చేసింది.  కోట్లాది మంది ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.  

Read: సూర్యుని వాతావ‌ర‌ణంలోకి మాన‌వుని కృత్రిమ మేధ‌స్సు…

ముఖ్యంగా ఆఫ్రికాలోని అనేక దేశాల‌కు ఈ వ్యాక్సిన్‌ను స‌ర‌ఫ‌రా చేసింది.  అయితే, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ప‌నితీరుపై హాంకాంగ్ ప‌రిశోధ‌కులు ఓ నివేదిక‌ను త‌యారు చేశారు.  సీనోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా వేరియంట్ల‌ను ఎదుర్కొనేంత యాంటీబాడీలు త‌యారు కావ‌డం లేద‌ని తెలియ‌జేసింది.  దీంతో ప్ర‌పంచంలోని కోట్లాది మందిలో భ‌యాలు మొద‌ల‌య్యాయి.  సార్స్‌కోవ్ 2, డెల్టా వేరియంట్ల కంటే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎలా ఎదుర్కొవాలో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు.  

Exit mobile version