Site icon NTV Telugu

కోవిడ్‌ మార్గదర్శకాలు మళ్లీ పొడిగింపు.. కొత్త ఆదేశాలు జారీ

కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మళ్లీ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఇక, కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు కూడా బయపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కేంద్రం కోవిడ్ మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది.. మరో నెల రోజుల పాటు కోవిడ్‌ మార్గదర్శాలు అమల్లో ఉంటాయంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, రానున్న పండుగ సీజన్‌లో పెద్ద సమూహాలతో సమావేశాలు జరుగకుండా చూసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో యాక్టివ్ కేసులు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు, వారి జిల్లాల్లో కేసుల పెరుగుదలను సమర్థంగా అదుపు చేయడానికి, వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలంటూ హోం సెక్రటరీ అజయ్‌ భల్లా తన లేఖలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రెటరీలను ఆదేశించారు..

Exit mobile version