ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లాకు తిరుగులేదు. టెస్లా సంస్థ నుంచి వచ్చే కార్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్‌తో నడిచేవే. టెస్లా షేర్లలో ఒడిదుడుకులు నమోదైనా, కంపెనీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. లక్షకోట్ల కంపెనీగా టెస్లా ఇప్పటికే పేరు తెచ్చుకున్నది. ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటంతో అన్ని కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్దం అవుతున్నాయి.
Read: ఒమిక్రాన్ అంటే ప్రపంచ దేశాలు ఎందుకు హడలిపోతున్నాయి?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. మెర్సిడెజ్ ఈక్యూ ఎక్స్ఎక్స్ కాన్సెప్ట్ కారును జనవరి 3 వ తేదీన లాంచ్ చేయబోతున్నది. ఈ కారును ఒకసారి ఛార్జింగ్ చేస్తే వెయ్యి కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణం చేయవచ్చు. అత్యంత వేగంగా వెళ్లేందుకు కావాల్సిన అన్ని ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
