NTV Telugu Site icon

సీఎం జగన్‌తో భేటీ తర్వాత మాట్లాడుతా : చిరంజీవి

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్య చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. దీంతో నిర్మాతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు. ప్రస్తుతు ఏపీ ఈ విషయం ముదురుతున్న నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు మెగాస్టార్‌ చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఏపీ సినిమా టికెట్ల ధరలపై చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సీఎం జగన్‌ ముందు చిరంజీవి ఎలాంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు చిరంజీవి హైదరాబాద్‌ నుంచి బయలు దేరారు. హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడకు బయలు దేరారు. అయితే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవిని సీఎం జగన్‌తో భేటీ గురించి ఎన్టీవీ అడుగగా సీఎం జగన్‌తో భేటీ తర్వాత మాట్లాడుతానని ఆయన వెల్లడించారు.