అంతరిక్షం ఎప్పుడూ చాలా ఆసక్తిగా ఉంటుంది. అంతరిక్షంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అ కేంద్రంలో కొన్ని రకాల పంటలు పండిస్తున్నారు. అయితే, ఇప్పుడు అంతరిక్షంలో మందులను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపైన తయారయ్యే మందులపై కొన్నిరకాల సూక్ష్మజీవుల ప్రభావం ఉంటుంది. కానీ, అంతరిక్షంలోని పీడనం, వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ ఎలాంటి సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. దీంతో స్పేస్‌లో మందులను తయారు చేస్తే అవి మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్ పరిశోధన సంస్థలు స్పేస్ ఫోర్జ్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్పేస్ ఫోర్జ్ వ్యోమనౌకను తయారు చేస్తుంది. ఈ నౌక ద్వారా అంతరిక్షంలో ల్యాబ్‌ల తయారీకి అవసరమైన మెటీరియల్స్‌ను తరలిస్తారు. ఆ ల్యాబ్‌లోనే మందులను, వ్యాక్సిన్‌లను తయారు చేయనున్నారు.
అంతరిక్షంలో మందుల తయారీ…
