న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది.. అంటే దానికి ప్రధాన కారణం టీం ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్. అయితే మొదట ఇన్నింగ్స్ లో వరుస వికెట్లు పడుతున్న మయాంక్ మాత్రం కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 150 పరుగులు చేసాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 62 పరుగుల వద్ద ఔట్ అయిన మయాంక్… రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసే అవకాశాని మిస్ అయ్యాడు. అయిన కూడా ఓ అద్భుతమైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
అదేంటంటే… రెండు ఇన్నింగ్స్ లలో హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేసిన భారత ఓపెనర్ గా రికార్డు నెలకొల్పాడు. అయితే అతని కంటే ముందు… ఈ ఎలైట్ జాబితాలో చేతన్ చౌహాన్ (1978 లో 52, 84), సునీల్ గవాస్కర్ (1978 లో 205, 73) మరియు క్రిస్ శ్రీకాంత్ (1987 లో 71, 65) వంటి వారు ఉన్నారు. దాంతో ఈ రికార్డు సాధించిన నాలుగో భారత ఓపెనర్ గా మయాంక్ నిలిచాడు.