Site icon NTV Telugu

మావోయిస్టుల అలజడి.. మందుపాతర పేలి ఆర్‌ఎస్‌ఐకి గాయాలు

తెలంగాణలో మావోయిస్టులు అస్థిత్వం కోసం పోరాడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్​ఆర్​ఎస్​ఐ గాయపడ్డారు. పోస్టర్లు, వాహనాల విధ్వంసంతో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

ఒకవైపు మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌లతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్​పీఎఫ్​ బలగాలతో కూంబింగ్ కొనసాగుతూనే వుంది. కూంబింగ్‌ నిర్వహించడంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులను పట్టుకునేందుకు అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

Exit mobile version