NTV Telugu Site icon

Metro Train : మెట్రో రైలులో లేని సీటు..సోఫాతో ప్రయాణం చేస్తున్న యువకుడు

So Fa In Metro Train

So Fa In Metro Train

ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు సీటును ముందుగా రిజర్వ్ చేసుకుంటాం. బస్సులు, రైళ్లల్లో ప్రయాణించినప్పుడు సీట్ల కోసం కుస్తీలు కూడా పడతారు. ఖాళీ సీట్లు లేకపోతే రద్దీగా ఉండే రైళ్లలో సుదీర్ఘ ప్రయాణం చేయడంతో చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అయితే, రైలులో సీటు దొరక్కపోవడంతో విసిగిపోయిన ఓ వ్యక్తి తనతో పాటు సోఫాను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చైనాకు చెందిన వ్యక్తి కూర్చోవడానికి తన సొంత సోఫాను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను సింగిల్ సీటర్ సోఫాను చుట్టూ మోస్తూ రైల్వే స్టేషన్ కి చేరాడు. చైనా ప్రజల దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచించాడు.

చైనాలోని హాంగ్జౌ నగరంలోని సబ్ వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్న ఓ యువకుడికి రైలులో కూర్చోవడానికి స్థలం దొరక్కపోవడంతో కూర్చోవడానికి కుషన్ సోఫా తెచ్చుకోవడం అలవాటు. ఆ వ్యక్తి హాంగ్‌జౌ మెట్రో ప్లాట్‌ఫారమ్‌లో లైన్ 2 దగ్గర సోఫాలో మామూలుగా కూర్చుని కనిపించాడు. ఆ వ్యక్తి తన సోఫాతో తిరుగుతున్న వీడియో చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అతని చర్యకు మెట్రో స్టేషన్ అధికారులు పెద్దగా జరిమానా విధించలేదు. సోఫాను బ్యాక్ ప్యాక్ లాగా పెట్టుకుని వెళ్లే యువకుడిని నెటిజన్లు, స్థానికులు వాటర్ మెలన్ గా పిలుస్తున్నారు.
Also Read:Mahie Gill: సీక్రెట్ మ్యారేజ్ పై పెదవి విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

ఈ సబ్‌వే మెట్రో రైలులో తను ఎప్పుడూ సీటు దొరకలేదని సదరు యువకుడు చెప్పాడు. అందుకే ఈ సోఫా ఐడియాతో వచ్చానని తెలిపారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాకపోకలు సాగిస్తుండగా సీటు దొరక్క ఇబ్బంది పడటంతో సొంతంగా సోఫా పెట్టుకోవాలనే ఆలోచన వచ్చిందని ఆ వ్యక్తి చెప్పాడు. తన వీడియోలను చూసిన చాలా మంది నెటిజన్లు సబ్‌వే స్టేషన్‌లోకి సోఫాను ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. సోఫాను సబ్‌వే స్టేషన్‌లోకి తీసుకురావడానికి రైల్వే స్టేషన్ సిబ్బందిని అనుమతి అడిగారు. అయితే, స్కానింగ్ సమయంలో సోఫా లోపల ఏమీ లేదని నిర్ధారించారు. తన సోఫా బ్యాక్‌ప్యాక్‌ని చుట్టూ తీసుకెళ్లడానికి మెట్రో సిబ్బంది అనుమతి తీసుకున్నాడు.

హాంగ్‌జౌ మున్సిపల్ ట్రాన్స్‌పోర్టేషన్ బ్యూరో ప్రకారం, ప్రయాణికులు 30 కిలోల వరకు మాత్రమే వస్తువులను తీసుకెళ్లగలరు. ప్రయాణికులు రైలులో 30 కిలోల వరకు బరువున్న వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. సహోద్యోగులు కూడా రద్దీ లేని సమయాల్లో సోఫాను తీసుకెళ్లి ప్రయాణించాలని సూచించాడు. తద్వారా సీట్ల కోసం ప్రజల మధ్య గొడవ జరగకూడదని చెప్పాడు. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రద్దీ లేని సమయాల్లో ప్రయాణించేలా చూసుకోవాలి అని సూచించాడు.

Also Read:Sreemukhi: రంగుదుస్తుల్లో రెచ్చిపోయిన రాములమ్మ