కరోనా తరువాత దేశం ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. పేదవాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. తినేందుకు తిండి దొరక్క చిన్నారులు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నా వారి పరిస్థితులు మారడంలేదు. ఇక చాలా మంది అలాంటి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఫొటోలు దిగుతుంటారు. దీనిని గమనించిన సునీల్ జోషి అనే ప్రైవేటు టీచర్ 50 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మధ్యాహ్న బోజన సౌకర్యం అదేలా చూస్తున్నారు. ఇక చిన్నారులు రోజూ స్కూల్‌కు వెళ్లేందుకు ఒ బస్సును కూడా ఏర్పటు చేశారు. ఉదయం పిల్లలు ఉండే ప్రదేశానికి వెళ్లి వారిని పిక్ చేసుకొని స్కూల్‌కి వెళ్తుంది. సాయంత్రం సమయంలో కూడా బస్స అలానే చేస్తుంది. ఉద్దాన్ సోసైటీ పిల్లలను దత్తత దీసుకున్నట్టు సునీల్ జోషి పేర్కొన్నారు.
50 మంది చిన్నారులను దత్తత తీసుకున్న టీచర్…
