చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సెల్ఫీలు ఎక్కువయ్యాయి. ఎప్పుడైనా ఒకటి రెండు ఫొటోలు తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని, ఎప్పుడూ అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటే, ఏదోక సమయంలో అభాసుపాలవ్వాల్సి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఇలానే ఓ యువతి అందంగా ముస్తాబై బురద కాలువ గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆ యువతి అదుపుతప్పి బురదకాలువలో పడిపోయింది.
Read: కరోనా అంతంపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు…
ఒళ్లంతా బురద అంటుకోవడంతో బేర్‌మని ఏడ్చేసింది. సెల్ఫీలు తీసుకోవచ్చు తప్పులేదు. అలాగని పిచ్చిపట్టినట్టుగా అదేపనిగా ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగితే ఇదిగో ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ అవుతున్నది. సెల్ఫీ మోజులో పడి చాలా మంది యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంత అవేర్‌నెస్ కల్పిస్తున్నా ఎలాంటి మార్పులు రావడంలేదు. జాగ్రత్తలు తీసుకోకుండా సెల్ఫీలు దిగాలని, పాపులారిటీ కావాలని రిస్క్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
వీడియోకోసం ఇక్కడ క్లిక్ చేయండి