టీఆర్‌ఎస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పెద్దల సభకు నామినేటెడ్ అయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనా చారి ఎన్నికయినట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి పేరును కేబినెట్ ఆమోదించి.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి పంపించారు. ఆమె ఆమోదించడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయినట్టు గెజిట్ విడుదల చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసినందుకు మధుసూదనాచారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. వారు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరకు చేరుస్తానన్నారు మధుసూదనాచారి.