NTV Telugu Site icon

Aadhaar: ఆధార్ కార్డ్ పోయిందా..? అయితే ఇలా ఆన్‌లైన్ నుంచి పొందండి..

Aadhaar Card

Aadhaar Card

Aadhaar Card: ఆధార్ కార్డ్.. ప్రస్తుతం భారతీయులకు ఎంతో ముఖ్యమైనది. భారతీయ పౌరులకు అందించే ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ పథకాలు, పనులకు, చదువులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేనిదే ఏ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. మన పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ డేటా లాంటి వ్యక్తిగత సమాచారం ఆధార్ కార్డు కలిగి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డు పోతే, చాలా కంగారు పడుతుంటారు. అయితే ఇప్పుడు డూబ్లికేట్ ఆధార్ కార్డ్ పొందడం చాలా సులువు. ఈ పద్దతులను ఉపయోగించి ఆధార్ కార్డును ఈజీగా ఆన్ లైన్ నుంచి పొందవచ్చు.

UIDAI పోర్టల్ నుంచి ఆధార్ కార్డ్ ఇలా పొందండి..

UIDAI సర్వీస్ పోర్టల్ నుంచి మీ ఆధార్ కార్డు కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు మీ పేరు, పుట్టిన తేదీ, మీ ఆధార్ కార్డ్ పై ఉన్న 12 అంకెల నెంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కింది దశల్ని ఉపయోగించి మీ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

1) ముందుగా https://ssup.uidai.gov.in/web/guest/ssup-homeలో వెబ్ పేజీని ఓపెన్ చేసి ‘ లాస్ట్ లేదా ఫర్గెటెన్ UID/EID’ బటన్ పై క్లిక్ చేయాలి.

2)  సరైన ఆప్షన్ (ఆధార్ నంబర్ లేదా నమోదు సంఖ్య) ఎంచుకోవాలి.

3)మీ పూర్తి పేరు, నమోదిత ఇమెయిల్ చిరునామా మరియు నమోదిత మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

4) స్క్రీన్ పై ఉన్న సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి, ‘‘ వన్ టైం పాస్ వర్డ్ పొందండి’’ బటన్ పై క్లిక్ చేయాలి.

5) మీ రిజిస్టర్ మొబైన్ నెంబర్ కు లేదా మీ ఇమెయిల్ అడ్రస్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.

6) ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత, రిజిస్టర్ మొబైల్ నంబర్ కు లేదా.. ఈ మెయిల్ అడ్రస్ కు ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ వస్తుంది.

7) UIDAI సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ లోకి మళ్లీ వెళ్లి.. ‘‘ డౌన్ లోడ్ ఆధార్’’ బటన్ ప్రెస్ చేయాలి.

8) మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పేరు, పిన్ కోడ్ , క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.

9) ‘‘ గెట్ వన్ టైం పాస్ వర్డ్’’ బటన్ క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలిన

10) ఓటీవీ వెరిఫికేషన్ తర్వాత, మీరు మీ ఆధార్ కార్డు కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

UIDAI హెల్ప్‌లైన్ సహాయంతో ఇలా ఆధార్ కార్డ్ పొందాలి..

మీ ఆధార్ కార్డ్‌ని తిరిగి పొందడానికి మీరు UIDAI హెల్ప్‌లైన్‌కి 1800-180-1947 (టోల్-ఫ్రీ) లేదా 011-1947 (లోకల్)కి కాల్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ వారం రోజులు ఉదయం 7:00 నుండి రాత్రి 10:00 వరకు అందుబాటులో ఉంటుంది.

1) UIDAI హెల్ప్‌లైన్ నంబర్ (1800-180-1947 లేదా 011-1947) డయల్ చేయండి.

2) IVR సూచనలను చెప్పినట్లు చేయాలి. దీంట్లో మీ ఆధార్ కార్డును తిరిగి పొందడాని ఆప్షన్ ఎంచుకోవాలి.

3) మీ పేరు, పుట్టిన తేదీ మరియు ఇతర అవసరమైన వివరాలను తెలపాలి.

4) వెరిఫికేషన్ తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఆధార్ కార్డ్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ వస్తుంది.
ప్రకటన

5) ఆ తరువాత మీ ఆధార్ కార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి UIDAI సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను వెళ్లాలి.

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ నుంచి ఇలా ఆధార్ కార్డ్ పొందండి..

ముందు చెప్పిన విధంగా మీరు మీ ఆధార్ కార్డ్‌ని తిరిగి పొందలేకపోతే, డూప్లికేట్ ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లవచ్చు.

1) సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.

2) ఆధార్ కరెక్షన్ ఫారమ్‌ను నింపాలి, ఒరిజినల్ ఆధార్ కార్డ్ కాపీ ఉంటే దాన్ని జతచేయాలి.

3) ఫీ పే చేసి, ఫారమ్ ని ఇవ్వాలి.

4) ఆ తరువాత మీ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో రసీదు స్లిప్‌ను ఇస్తారు. ఆ తరువాత ఆధార్ కార్డు వస్తుంది.

Show comments