Site icon NTV Telugu

చైనా ఫోన్ల‌పై నిషేదం… ఇదే కార‌ణం…

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చైనా కంపెనీల‌కు చెందిన మొబైళ్లు ఎలా విస్త‌రిస్తున్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  త‌క్కువ ధ‌ర‌కు మార్కెట్లో దొరుకుతుండ‌టంతో విచ్చ‌ల‌విడిగా వీటిని కొనుగోలు చేస్తున్నారు.  అయితే, చైనా మొబైళ్ల ద్వారా వినియోగ‌దారుల డేటాను చైనా ప్ర‌భుత్వం సేక‌రిస్తోంద‌నే అరోప‌ణ‌లు ఉన్నాయి.  ఇప్పుడు చైనా మొబైళ్లు కొన్ని ప‌దాల‌ను ఆటోమేటిక్‌గా సెన్సార్‌షిప్ చేస్తోంద‌ని లిథుయేనియా ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది.  చైనాకు చెందిన మొబైళ్ల‌ను విసిరికొట్టాల‌ని, భ‌విష్య‌త్తులో చైనాకు చెందిన మొబైళ్ల‌కు కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది.  చైనా మొబైళ్ల‌ను వాడ‌కూడ‌దు అని చెప్పి ఒక ప్ర‌భుత్వం ఇలా ఆదేశాలు జారీ చేయ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  లిథుయేనియా ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ తాజాగా ఓ నివేదిక‌ను త‌యారు చేసింది.  ఈ నివేదిక‌లో చైనా మొబైళ్ల‌ను నిషేదించాల‌ని ఉండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  చైనా మొబైళ్లు 449 ప‌దాల‌ను ఆటోమేటిక్‌గా సెన్సార్‌షిప్ చేస్తున్నాయ‌ని నివేదిక‌లో పేర్కొన్నారు.  అయితే, త‌మ మొబైల్ ఫోన్ల‌లో ఎలాంటి సెన్సార్‌షిప్‌లు లేవ‌ని షియోమీ, హువానీ కంపెనీలు చెబుతున్నాయి.  

Read: అరుదైన రికార్డ్‌: 300సార్లు కాలిన‌డ‌క‌న తిరుమ‌లకు…

Exit mobile version