అడవికి రాజు సింహం. సింహం ఎదురుగా వస్తుంటే అన్ని జంతువులు భయపడి పారిపోతుంటాయి. అయితే, ఓ చిన్న జంతువు సింహాన్ని ఎదిరించి నిలబడింది. గాంభీర్యంగా నిలబడి ఉన్న సింహాన్ని తనదైన శైలిలో భయపెట్టింది. అక్కడి నుంచి పారిపోయేలా చేసింది గ్రామంసింహం. గ్రామ సింహాలు అని కుక్కల్ని పిలుస్తారు. ఊర్లోకి ఎవరైన కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటపడి కరుస్తాయి. లేదంటే పెద్దగా అరిచి భయపెడుతుంటాయి. అడవిలో ఉన్న ఓ సింహం రోడ్డు మీదకు వచ్చింది. అలా వచ్చిన సింహాన్ని చూసిన ఓ కుక్క ఏ మాత్రం భయపడకుండా ఎదురెళ్లి భయపెట్టింది. ఒక దశలో సింహం తన పంజాను విసిరినా ఆ శునకం లెక్క చేయలేదు. శునకం ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన సింహం అక్కడి నుంచి వెనుదిరింది. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: మెటా వర్స్ అంటే ఏంటి? ఫేస్‌బుక్ దీనిపై ఎందుకు దృష్టి సారించింది?