సముద్రాల్లో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. అరుదైన సముద్ర జంతువులు ఈ కాలుష్యానికి నశించిపోతున్నాయి. కాలుష్యంతో పాటుగా బీచుల్లో పడేసిన చెత్త సముద్ర జలాల్లోకి ప్రవేశించంతో జలచర జీవులు ఇబ్బందులు పడుతున్నాయి. బీచ్ అందాలకు చెత్త అవరోధంగా మారింది. ఎంత అవగాహన కలిగించినప్పటికీ మార్పు రాకపోవడంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కువైట్ బీచుల్లో చెత్తను వేసిన వారిపై కఠిన చర్యలతు తీసుకునేందుకు సిద్ధమయింది. బీచుల్లో చెత్తను వేసినవారికి 10వేల కువైట్ దినార్లు జరిమానాగా విధిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. మరి ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో మార్పు వస్తుందా చూడాలి.
Read: చైనా దురాక్రమణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు… హిమాలయ సరిహద్దుల్లో…
