Site icon NTV Telugu

డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో మెరిసిన కృతి

Kriti Sanon Dabboo Ratnani photo shoot

ఈ ఏడాది డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో పలువురు ప్రముఖ నటీనటులు మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్ డబ్బూ రత్నాని ఫోటోషూట్ లో హాట్ గా కన్పించి హీట్ పెంచేసింది. ఇందులో మొత్తం బ్లాక్ దుస్తులు ధరించింది. కృతి సనన్ ఫాక్స్ లెదర్ ఫ్యాషన్ ప్యాంటు, ఆఫ్-షోల్డర్ క్రాప్ టాప్ లో, బ్లాక్ నెయిల్ పాలిష్, వేళ్ళకు ఉంగరాలతో ఉన్న ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక ఈ బ్యూటీ తన రాబోయే ప్రాజెక్ట్ లపై అప్డేట్స్ ఇస్తూ, మరోవైపు హాట్ పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది.

Read Also : తాప్సి స్పోర్ట్స్ డ్రామాకు డైరెక్టర్ చేంజ్ ?

ప్రస్తుతం ఆమె ఖాతాలో పలు భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. “బచ్చన్ పాండే”లో అక్షయ్ కుమార్ సరసన కృతి కనిపించనుంది. పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”లో ప్రభాస్ తో నటించనుంది. టైగర్ ష్రాఫ్‌తో మరోసారి కనిపించనుంది. అంతేకాదు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న “భీడియా” అనే హర్రర్-కామెడీలో, రాజ్ కుమార్ రావు “హమ్ దో హమారే దో” అనే చిత్రాల్లో కూడా కృతి హీరోయిన్ పాత్రలు పోషిస్తోంది.

Exit mobile version