NTV Telugu Site icon

తెలంగాణలో పొలిటికల్ హీట్.. ఈటలతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోదండరాం భేటీ

ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ బిజేపిలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ ఈటల నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించినట్లు సమాచారం. ఈటల బిజేపిలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం కెసిఆర్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.