Site icon NTV Telugu

క్వాలిఫైర్స్-2 కి కేకేఆర్…

ఐపీఎల్ 2021 లో నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు పైన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూర్ జట్టులో కోహ్లీ(39) రాణించడంతో నిర్ణిత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఇక అనంతరం 139 పరుగుల టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ జట్టు లక్ష్య చేధనను బాగానే ఆరంభించింది. అయితే నెమ్మదిగా వెళ్తున్న కేకేఆర్ ఛేదనలో సునీల్ నరైన్ వేగం పెంచాడు. అతను బ్యాటింగ్ కు వచ్చిన 12వ ఓవర్ లో మూడు సిక్సులు సహాయంతో 22 పరుగులు సాధించాడు. దాంతో మ్యాచ్ కేకేఆర్ వైపుకు తిరిగింది. ఇక అనంతరం సాధించాల్సిన పరుగులు తక్కువే ఉండటంతో నెమ్మదిగా ఆడుతూ చివరి ఓవర్ లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది కేకేఆర్. దాంతో క్వాలిఫైర్ 2 లోకి నైట్ రైడర్స్ ప్రవేశించారు. ఇక గత ఏడాది ఐపీఎల్ లో ఎలిమినేటర్ దశలో వెనుదిరిగిన బెంగళూర్ ఇప్పుడు అదే స్థానం నుండి వెనకకు వచ్చేసింది.

Exit mobile version