Site icon NTV Telugu

కల్వకుంట్ల పాల‌న‌పై.. తెలంగాణ పౌరుషాన్ని చూపించాలి : కిష‌న్ రెడ్డి

సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హింస, ఘర్షణలు ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబ పాలనపై తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చూపించాలని కోరారు. విష ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్న టీఆర్ ఎస్‌ నేతలను ఉరికించాలని… కేసీఆర్ కు కుడివైపు అసదుద్దీన్ ఒవైసీ, ఎడమవైపు అక్బరుద్దీన్ ఓవైసీ పెట్టుకుని మత పర హింస గురించి మాట్లాడుతున్నారని మండి ప‌డ్డారు.

ముంబైలో “ఆర్ఆర్ఆర్” ఈవెంట్… మేకర్స్ నిర్ణయంతో ఫ్యాన్స్ కు షాక్

హిందు వులను, హిందు దేవతలని కించపరుస్తూ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారితో పొత్తు పెట్టుకున్నాడని… కాశీ పునరుద్ధరణ పై సీఎం కేసీఆర్ కు ఎందుకు బాధ అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ యజ్ఞాలు చేయొచ్చు- బీజేపీ మాత్రం చేయొద్దా ? కేసీఆర్ రైతులను భయపెడుతూ.. మోసం చేస్తున్నారని ఆగ్ర‌హించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కెసిఆర్ ధర్నాకు రాలేదని… లేని సమస్య పై ఇందిరా పార్కులో ధర్నా చేశారని మండి ప‌డ్డారు. పీయూష్ గోయల్ స్పష్టంగా పార్లమెంట్ లో ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు.

Exit mobile version