తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక కేసులు విచారణకు రానున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై నేడు హైకోర్టు విచారించనుంది. చెన్నమనేని తరపున నేడు మరోసారి వాదనలు వినిపించనున్నారు హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ. సిటిజన్ షిప్ యాక్ట్ నిబంధనలు, వాటి ఉల్లంఘన పై oci కార్డ్ అనుమతులపై నేడు వివరణ ఇవ్వనున్నారు చెన్నమనేని తరపు న్యాయవాది. నేడు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు.
ఇటు ఇళ్ళ మధ్య ఉన్న పబ్ ల పై నేడు హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే 10 పబ్ లకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. నేడు హైకోర్టు కు నివేదిక సమర్పించనున్నారు పబ్ నిర్వహకులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్. నిబంధనలు ఉల్లంఘించి పబ్ లు నిర్వహిస్తున్నారని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇళ్ళ మధ్య ఏర్పాటు చేసిన పబ్ లపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్స్ కోర్టుని కోరారు. పిటిషన్ పై నేడు మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు.
