Site icon NTV Telugu

టీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా కేసీఆర్ ఏక‌గ్రీవ ఎన్నిక‌

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. టీఆర్ఎస్‌ ప్లీన‌రీ సమావేశం లో అధికారికంగా ప్రక‌టించారు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు. దీంతో ఏకంగా 9 వ సారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఎన్నిక అయ్యారు. ఇక అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ఏక గ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తొలిసారి 2001 సంవత్సరంలో జల దృష్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించామని చెప్పారు. రక రకాల అప నమ్మకాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు సీఎం కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మరియు నేతల కారణంగా పార్టీ ఈ స్థితికి వచ్చిందని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే… తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగిందన్నారు.

Exit mobile version