ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 నగరాల్లో న్యూయార్క్ కూడా ఒకటి. అక్కడ జీవించాలంటే ఒక వ్యక్తి సగటు వ్యయం 1341 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం లక్ష రూపాయలు. నెలకు ఇంత ఖర్చు అంటే మనం నోరెళ్లబెడతాం. ఎంత తగ్గించుకున్నా కనీసం వెయ్యి డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ, ఓ మహిళ మాత్రం కేవలం నెలకు 200 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తూ జీవనాన్ని సాగిస్తోంది. అంత ఖరీదైన నగంలో మరీ అంత తక్కువ ఖర్చుతో ఆ మహిళ ఎలా జీవిస్తుందని అనుకోవచ్చు. ఉద్యోగాలు వంటివి లేవా అంటే వృత్తిరిత్యా అకౌంటెంట్. మంచి జీతం వస్తున్నా దుబారా చేయకుండా 200 డాలర్లతోనే గడిపేస్తుందట. కేవలం ఇంటి అద్దెకోసం, తన తిండి కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తుందట. 1998 నుంచి ఇప్పటి వరకు ఆమె కొత్త దుస్తులు కొనుగోలు చేయలేదట. అంతేకాదు, బట్టలను సొంతంగా ఉతుక్కుంటుంది. ఇంట్లోకి కావాల్సిన సామానులను చెత్త నుంచి ఏరుకొని వస్తుందట. అమె పడుకునే మంచం కూడా చెత్తలో పడేసి ఉంటే తెచ్చుకొని వినియోగించుకుంటోంది. తన జీవితంలో డబ్బును పొదుపు చేసుకునే మార్గాలను కనుగొన్నానని, న్యూయార్క్ వంటి నగరాల్లో జీవనం అంటే ఖరీదైన వ్యవహారం అని చెప్పుకొచ్చింది కేట్ హషిమోటో.
Read: ఓ బాధితుని ఆవేదన: భార్యతో వేగలేకపోతున్నా… నన్ను జైల్లో ఉంచండి…