Site icon NTV Telugu

ఆయన 3 అడుగులు, ఆమె 2 అడుగులు.. కలిసి 7 అడుగులు వేశారు

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. ఎవరికి ఎవరితో ముడి పడేది ముందే నిశ్చయించబడుతుందని చెబుతారు.. ఇక, ఆ జంట చూడ ముచ్చటగా ఉంటే.. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అని అభినందిస్తారు.. బెంగళూరులో తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంటను చూస్తే చూడ ముచ్చటగా ఉంది.. వరుడు విష్ణుకు 28 వచ్చినా.. వధువు జ్యోతికి 25 ఏళ్లు నిండినా.. వయస్సుకు తగ్గట్టు శరీరంలో పెరుగుదల లేదు.. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.. అయితే, ఈ క్యూట్‌ కపుల్‌కు కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో వివాహ వేడుక జరిగింది.

Read Also: కాల్ మనీ వేధింపులు.. వీఆర్వో ఆత్మహత్య

ఈ వివాహాన్ని చూస్తే బాల్య వివాహం చేశారా? అనే అనుమానం కలిగేలా ఉంది.. వరుడు విష్ణు ముచ్చటగా మూడు అడుగుల ఎత్తు ఉంటే.. వధువు జ్యోతి 2 అడుగుల ఎత్తు ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వివాహం వైభ‌వంగా జ‌రిగింది. విష్ణుది బెంగళూరు అయితే.. జ్యోతిది కోలార్‌.. ఇద్దరూ బెంగ‌ళూరులో మంచి ఉద్యోగాలే చేస్తున్నారు.. మ‌ర‌గుజ్జులు కావ‌డంతో పెద్దలు చేసిని పెళ్లి ప్రయత్నాలు చాలానే బెడిసి కొట్టాయి.. కానీ, వీరు కలిసి ఏడు అడుగులు వేయాల్సి ఉందేమో.. విష్ణు కుటుంబానికి జ్యోతి గురించి తెలిసింది… ఇంకేముందు.. అలా సంబంధం కలుపుకుని పెళ్లి చేశారు.. ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. ఈ క్యూట్‌ కపుల్‌కు శుభాకాంక్షలు తెలిపుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Exit mobile version