NTV Telugu Site icon

మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా….!

Jr. NTR Emotional Post on NTR 98th Birth Anniversary

“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది… మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా… సదా మీ ప్రేమకు బానిసను… నందమూరి తారకరామారావు” అంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు 99వ జయంతి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన తెలుగు ముద్దుబిడ్డ ఎన్టీఆర్. నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ. తెలుగు ప్రజలు ఆయనలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని చూసుకుంటారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారు. యవత్ తెలుగు ఖ్యాతిని శిఖరాగ్రాన నిలిపారు. ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించగా.. చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. కళ్యాణ్ రామ్, నారా రోహిత్ తదితరులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు.