NTV Telugu Site icon

వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు..ఉపాధ్యక్షుడు రఘురామ !

ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ వేదికగా ఎంపి రఘురామకృష్ణరాజుపై ఎమ్యెల్యే జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే.. ఉపాధ్యక్షుడు రఘురామ కృష్ణరాజు అని ఆయని ఫైర్ అయ్యారు. వైసీపీ పార్టీ గుర్తు, సిఎం జగన్ ఫోటోతో రఘురామకృష్ణరాజు గెలిచారని గుర్తు చేశారు. ఆయన ఎంపి పదవీకి రాజీనామా చేస్తే వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేరని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఇలాంటి మాటలు.. మాట్లాడకూడదని.. కానీ రఘురామకృష్ణరాజు చేసిన పనికి మాటలు ఆగటం లేదన్నారు. తాను ఏమైనా తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించాలని జోగి రమేష్ పేర్కొన్నారు.