NTV Telugu Site icon

Jharkhand students: రిక్రూట్‌మెంట్ విధానంపై జార్ఖండ్ విద్యార్థి సంఘం నిరసన

Jharkhand Students'

Jharkhand Students'

జార్ఖండ్ లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 60:40 నిష్పత్తి ఆధారిత నియామక విధానానికి వ్యతిరేకంగా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (JSU) 72 గంటల ఆందోళనను ప్రారంభించింది. సోమవారం నాడు సీఎం ఇంటికి ఘెరావ్‌తో నిరసన ప్రారంభమైంది. 60:40 రేషన్ ఆధారిత ఉపాధి విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. దీని ప్రకారం రాష్ట్రానికి చెందిన వర్గాల అభ్యర్థులకు 60 శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే అందుబాటులో ఉన్న స్థానాల్లో 40 శాతం ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోసం కేటాయించబడ్డాయి. పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వం ఏ డిమాండ్‌ను పట్టించుకోలేదన్నారు.

Also Read:Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ ప్లేస్ ఆయనకే..
కొత్త విధానంలో స్థానిక ముల్వాసి కమ్యూనిటీకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు JSU నాయకుడు, మనోజ్ యాదవ్ తెలిపారు.జార్ఖండ్ బంద్‌కు ప్రజల మద్దతు కోరుతూ జేఎస్‌యూ మంగళవారం ర్యాలీ నిర్వహించనుంది. రాంచీలోని జిల్లా యంత్రాంగం అధికారిక నివాసాన్ని సీజ్ చేయాలనే యూనియన్ ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకుని సిఎం ఇంటికి 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేసింది. రామమందిర్ చౌక్ వద్ద కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సిఎం ఇంటి వరకు వెళ్లే రహదారిపై భారీగా బారికేడ్లు వేశారు. ఆందోళనను నియంత్రించేందుకు 2,000 మంది అదనపు బలగాలను మోహరించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) తెలిపారు.

Show comments