విశాఖ రుషికొండ హరిత రిసార్ట్స్ ను సందర్శించారు సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా విశాఖ లో రుషికొండ ప్రాంతం టూరిజం హబ్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతానికి ఇక్కడినుంచే కాదు ప్రక్క రాష్ట్రాలు నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
జీవో నెంబర్ 3454 ప్రకారం కొండలు అలాగే నదులు రానున్న రోజుల్లో జరిగే అభివృద్ధి దృష్ట్యా వేటిని కూడా తొలగించకూడదు, ఒకవేళ తొలగించాలి అని అనుకుంటే తప్పకుండా ప్రజల అనుమతి తీసుకోవాలి. హుదుద్ సమయంలో వచ్చే గాలులును ఈ కొండలు ఉండటం వల్ల బాగా అడ్డుకున్నాయి.
ఇలాంటి కొండలు తొలగించటం వలన రానున్న రోజుల్లో వచ్చే ప్రమాదాలను కూడా అంచనా వేయాలి. 2006 లో వీఎంఆర్డీయే ఇచ్చిన జీవో ప్రకారం దానిలో ఉన్న అంశాలు పాటించారా లేదా అన్నది కూడా పరిశీలించాలన్నారు లక్ష్మీనారాయణ. రుషికొండకే ముప్పు కలిగించే నిర్ణయాలు వద్దన్నారు.