NTV Telugu Site icon

తెలంగాణను వ‌దిలి చాలా న‌ష్ట‌పోయాం… జేసీ దివాక‌ర్ రెడ్డి…

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజున ఏపీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి అసెంబ్లీకి వ‌చ్చారు.  ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను క‌లిశారు.  అనంత‌రం సీఎల్పీలోని త‌న పాత మిత్రుల‌ను క‌లిశారు.  ఆ త‌రువాత జేసీ మీడియాతో ముచ్చ‌టించారు.   తెలంగాణ‌ను వ‌దిలి చాలా న‌ష్ట‌పోయామ‌ని తెలిపారు.  నాగార్జున సాగ‌ర్‌లో జానారెడ్డి ఓడిపోతాడ‌ని తాను ముందే చెప్పాన‌ని, ఎందుకో అంద‌రికీ తెలుసున‌ని అన్నారు.  హుజురాబాద్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు.  ఏపీ రాజ‌కీయాల కంటే తెలంగాణ రాజ‌కీయాలే బాగున్నాయ‌ని, తెలంగాణ‌ను వ‌దిలి చాలా న‌ష్ట‌పోయామ‌ని అన్నారు.  ఏపీని వ‌ద‌లి తెలంగాణ‌కు వ‌చ్చేస్తాన‌ని జేసి చెప్పుకొచ్చారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పాల‌న‌లో జేసీ దివాక‌ర్ రెడ్డి కీల‌క నేత‌గా రాష్ట్ర‌రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు.  

Read: ముగిసిన బీఏసీ స‌మావేశం… అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు స‌మావేశాలు…