Site icon NTV Telugu

Japan PM Kishida : జపాన్ ప్రధానిపై దాడి…

Japan Pm

Japan Pm

జపాన్ ప్రధానిపై దాడి జరిగింది. వాకయామా నగరంలో బహిరంగ ప్రసంగం సందర్భంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమీపంలో పైపు లాంటి వస్తువు విసిరారు. ఘటనా స్థలంలో పేలుడు లాంటి శబ్దం వినిపించింది. అయితే ఘటనా స్థలంలో గాయాలు లేదా నష్టం జరిగినట్లు వివరాలు తెలియరాలేదు.
Also Read:Software Couple: బర్త్‌ డే విషెస్‌తో ఒక్కటైన విడిపోయిన సాఫ్ట్‌వేర్‌ జంట.. సీఐపై ప్రశంసలు..

ప్రధాని కిషిడా పేలుడు జరిగిన ప్రదేశంలో నుంచి సురక్షితంగా బయటపడ్డారని జపాన్ మీడియా పేర్కొంది. కిషిదా ఘటనా స్థలంలో తలదాచుకున్నారని, ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. పశ్చిమ జపనీస్ నగరంలో ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించిన తర్వాత కిషిడా తన ప్రసంగాన్ని ప్రారంభించినట్లు జపాన్ మీడియా పేర్కొంది. పశ్చిమ జపాన్‌లోని వాకయామాలో కిషిడా ప్రసంగించడానికి వచ్చిన ప్రదేశంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

కాగా, గతేడాది జూలై 2022లో ప్రచార కార్యక్రమంలో మాట్లాడున్న సందర్భంగా మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. షింజో అబే హత్య తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసింది.

Also Read:Summer drinks: వేసవిలో ఆరోగ్యం కోసం ఈ డ్రింక్స్ తీసుకోండి

Exit mobile version